Reading Time: 2 minutes
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్ అంటేనే సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. పైలట్లు క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే పైలట్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పైలట్లను కొన్ని అంశాలు భయపెడుతున్నాయి. వాటిలో ప్రధానమైనంది ఫామ్‌హౌస్స్‌లో పెడుతున్న హైబీమ్‌ లైట్స్‌. ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కాక్‌పిట్‌పై ఒక్కసారి డిస్కో లైట్లు పడ్డాయి. దీంతో కాసేపు గందరగోళానికి గురయ్యారు పైలట్లు. అయితే వెంటనే తేరుకుని విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేయగలిగారు. ఈ విషయంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పైలట్ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఏటీసీ అధికారులు.. సర్దార్‌నగర్, రావిర్యాల గ్రామాల సమీపంలోని ఫంక్షన్ హాల్ లేదా ఫామ్‌హౌస్ నుంచే ఈ కాంతులు వచ్చినట్లు గుర్తించారు. గతంలో కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో విమానానికి, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా విమానానికి కూడా లేజర్ కాంతులు తాకినట్లు పైలట్లు ఏటీసీకి ఫిర్యాదు చేశారు. ఈ వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు.. హైదరాబాద్ అదనపు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్‌హౌస్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లేజర్ బీమ్‌, స్కై బీమ్‌, సెర్చ్ లైట్‌, మూవింగ్ బీమ్‌తో పాటు అధిక తీవ్రత గల డిస్కో లైట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఫామ్‌హౌస్‌లు, ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకులు హెచ్చరించారు. ఇటీవల శంషాబాద్‌ ఎయిర్ పోర్టు పరిసరాల్లో జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీనికితోడు ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో లేజర్‌ లైట్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. కొన్ని ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భారీ డిస్కోలైట్లు, బీమ్‌లైట్లతో పార్టీలు నిర్వహిస్తున్నారు. ఆ లైట్లప్రభావం విమానం ల్యాండింగ్ సమయంలో పైలట్లపై పడుతుంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఈసారి మరింత సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బిగ్ షాక్..అకౌంట్లు బ్లాక్!

అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!

టాయిలెట్‌ కోసం బ్రేక్‌ ఇవ్వలేదని దారుణ హత్య.. షాకింగ్‌ నిజం చెప్పిన డ్రైవర్‌