
సంతోష్ దాబా… హైదరాబాద్ లో ఈ హోటల్ గురించి తెలియనివారు ఉండరనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీకెండ్స్ ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్స్, దాబాలకు వెళ్లాలంటే చాలామంది ఫస్ట్ ఛాయస్ సంతోష్ దాబా అని చెప్పచ్చు. అక్కడ ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది మరి. అయితే.. మియాపూర్ లో ఉన్న సంతోష్ దాబాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల గురించి తెలిస్తే షాకవుతారు. గురువారం ( ఆగస్టు 6 ) ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఈ తనిఖీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు నిర్లక్ష్యం బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మియాపూర్ లోని సంతోష్ దాబాలో సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై లేబుల్స్ లేకపోవడం గుర్తించినట్లు తెలిపారు అధికారులు. ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్‌నెట్స్, అప్రాన్, గ్లోవ్స్ లేకుండా పనిచేస్తున్నారని.. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, సీలింగ్ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.
స్టోర్ రూమ్ లో సరైన లైటింగ్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులు. మెడికల్, పెస్ట్ కంట్రోల్, వాటర్, ఫుడ్ టెస్టింగ్ కి సంబంధించిన రికార్డులు యాజమాన్యం యాజమాన్యం చూపించలేదని తెలిపారు అధికారులు.
ప్యాకేజింగ్ కు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవని..గోడల టైల్స్ దెబ్బతినడం, చిల్లర్ సక్రమంగా నిర్వహించడంలేదని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేశామని తెలిపారు అధికారులు.