
IND vs Sri Lanka XI Warm Up: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్ (Sri Lanka XI) తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కొలంబోలోని NCC గ్రౌండ్‌లో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో గిల్ స్థానంలో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. గురువారం నాడు ప్రాక్టీస్ సెషన్లో గిల్ కుడి చేతిలోకి బాల్ బలంగా తగలడంతో.. అతడు ఈ వార్మాప్ మ్యాచ్ కి దూరమయ్యాడు.
శుభ్‌మన్ గిల్‌కు ఏమైంది?
గురువారం నాడు నెట్స్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేస్తుండగా మొదట వేలికి బంతి తాకింది. ఆ తర్వాత స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మళ్లీ అదే వేలికి మరోసారి దెబ్బ తగిలింది. ఫిజియో చికిత్స అందించిన తర్వాత ఇండియా కెప్టెన్ గిల్ ఐసింగ్ చేసుకున్నాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని, రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ అతనికి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం గిల్ కోలుకుంటున్న తీరును మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక XI:
ఈ 3 రోజుల రెడ్-బాల్ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ కెప్టెన్ సోనాల్ దినుషా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. భారత్ తరఫున రాహుల్ సారథ్యంలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన జట్టు బరిలోకి దిగింది.
ఇరుజట్ల స్క్వాడ్:
టీమిండియా: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్.
శ్రీలంక ఎలెవన్ జట్టు: నిషాన్ మదుష్క, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా (కెప్టెన్), అంజల బండార (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసెంక మనోజ్, ఇసిత విజేసుందర, రమేష్ మెండిస్, దిలుమ్ సుదీర, కేశర నువంత, రవిందు రసంత.