
సిరిసిల్ల, వెలుగు: ఫోర్జరీ సంతకాలతో తన 20 గుంటల భూమిని కాజేశారని ఓ రిటైర్డ్ టీచర్ ఆరోపించారు. గురువారం సిరిసిల్లలో రిటైర్డ్ టీచర్ గొట్టె అంజయ్య మీడియాకు వివరాలు వెల్లడించాడు. తన భార్య గొట్టె దేవేంద్ర పేరిట చంద్రంపేట శివారులోని సర్వే నంబర్ 1312లో 45 గుంటల భూమి ఉందన్నారు.
ఇందులో 20 గుంటల భూమిని అశోక్‌రావు అనే వ్యక్తికి విక్రయించామని, అయితే మిగిలిన మరో 20 గుంటల భూమిని ఫోర్జరీ సంతకాలతో తన పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినప్పటికీ, కేసు దర్యాప్తును సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి నీరుగారుస్తున్నారని అంజయ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిస్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.