Reading Time: < 1 minute
Realme 16x 5g India Launch Confirmed For August 12 7000mah Battery 144hz Display And Dimensity 6300

Realme 16x 5G: రియల్ మీ (realme) నుండి కొత్తగా రాబోతున్న రియల్ మీ 16X 5G (realme 16x 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 12న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. గత ఏడాది వచ్చిన realme 15x 5Gకు అప్డేటెడ్ గా వస్తున్న ఈ ఫోన్ “Stay Smooth. Stay Unstoppable” ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇవ్వనుంది.

realme 16x 5Gలో 7,000mAh సామర్థ్యమున్న భారీ బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఈ మొబైల్ కు అదనంగా 6 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ ప్రామిస్, 60 నెలల ఫ్లూయెన్సీ గ్యారంటీతో దీర్ఘకాలం పాటు మెరుగైన పనితీరు అందిస్తామని కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. అలాగే IP65 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. లీకులు, టీజర్ల ప్రకారం ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో స్క్రోలింగ్, గేమింగ్, రోజువారీ వినియోగంలో మరింత స్మూత్ అనుభవాన్ని అందించనుంది.

Image (6)

ఈ మొబైల్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో రానుంది. వెనుక భాగంలో వర్టికల్ కెమెరా మాడ్యూల్‌తో పాటు రింగ్ ఫ్లాష్ డిజైన్‌ను అందించారు. ఈ ఫోన్ ఎండురన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్ రంగుల్లో విడుదల కానుంది. ఈ ఫోన్ బడ్జెట్ నుంచి మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని రానుంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఆగస్టు 12న జరిగే లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు. లాంచ్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్కార్ట్ తో పాటు రియల్ మీ ఇండియా e స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.