
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన ఈ ప్రమాలంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.. ఖమ్మం జిల్లా గ్రీన్ ఫీల్డ్ హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి అతివేగంగా ముందున్న లారీని వెనుక నుంచి తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతులు చింతకాని మండలానికి చెందిన వాలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా గ్రీన్ ఫీల్డ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, హైవేపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.