
థాయ్ లాండ్ స్కూల్ కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు పదహారేళ్ల బాలుడు.. మొదట ఇంట్లో తన అమ్మమ్మ, తాతలపై కాల్పులు జరిపి, అనంతరం తాను చదువుతున్న స్కూల్ కు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. శుక్రవారం (ఆగస్టు7)ఉదయం థాయ్ లాండ్ రాజధాని బ్యాంక్ లోని ఓ స్కూల్ లో స్కూల్ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు అక్కడికక్కడే చననిపోయారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
బ్యాంకాక్ లోని నొంతుబరి ప్రావిన్స్ లోని డెబ్సిరిన్ స్కూల్ లో ఈ కాల్పులు జరిగాయి. స్కూల్ కు వెళ్లే ముందుకు నిందితుడు మొదట తన అమ్మమ్మ, తాతలను కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత స్కూల్ కు వచ్చి విద్యార్థులు, టీచర్లపై కాల్పులు జరిపాడు. అయితే ఈ రెండు దాడుల వెనక అంతుచిక్కని కారణమేంటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల్లో టీచర్లు, విద్యార్థులు..
కాల్పులలో ముగ్గురు టీచరు, ముగ్గురు విద్యార్థులు చనిపోయినట్లు థాయ్ లాండ్ విద్యాశాఖ మంత్రి ధృవీకరించారు.15 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా చెబుతోంది. కాల్పుల సమయంలో స్కూల్ లో సుమారు 3వేల మంది విద్యార్థులు,147 మంది టీచర్లు ఉన్నారు.
[Breaking] Student opens fire at Nonthaburi school, several injured
A student allegedly opened fire at Debsirin Nonthaburi School in Bang Kruai district on Friday morning, leaving an initial four to five people injured, police said.
Officers from Plai Bang Police Station were… pic.twitter.com/b2vGUwPg19
— Thai Enquirer (@ThaiEnquirer) August 7, 2026