Reading Time: 2 minutes
Hollywood Fully Focused On The Indian Market With The Spider Man Series

లేటెస్ట్‌గా రిలీజ్ అయిన హాలీవుడ్‌ సినిమా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు , ఇండియా ఎంత పెద్ద మార్కెట్‌గా మారిందో మరోసారి నిరూపించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 927 మిలియన్ డాలర్స్ వసూలు చేసి రెండో అతిపెద్ద గ్లోబల్ వీకెండ్‌ సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇండియాలో అయితే ఈ సినిమా ఫస్ట్ డే రూ. 72.44 కోట్ల గ్రాస్ రూ.60.60 కోట్ల నెట్ సాధించి హాలీవుడ్ ఓపెనింగ్ రికార్డులను తిరగరాసింది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రూ. 257 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ఇండియా మార్కెట్ ఇప్పుడు హాలీవుడ్‌కు ఎంత కీలకమో చూపించింది.

ఇదే సీరిస్‌లో వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించింది. ముగ్గురు స్పైడర్-మెన్‌లను ఒకే తెరపైకి తీసుకొచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1.921 బిలియన్ డాలర్లు వసూలు చేసి సోనీ పిక్చర్స్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ మూవీకి కూడా ఇండియాలో రూ. 218 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. 2019లో విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ మరో కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1.133 బిలియన్ డాలర్స్ వసూలు చేసి బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

ఇండియాలో ఈ సినిమా రూ. 105 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి, దేశంలో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన ఫస్ట్ స్పైడర్-మ్యాన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. 2017లో వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: హోమ్‌కమింగ్’ కలెక్షన్స్‌ పరంగా స్ట్రాంగ్‌ బేస్‌ వేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 880.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో ఈ సినిమా రూ. 75 కోట్లకు పైగా గ్రాస్, సుమారు రూ. 58 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇండియాలో హోమ్‌కమింగ్‌తో స్టార్ట్ అయిన జర్నీ ఫార్ ఫ్రమ్ హోమ్‌తో వంద కోట్ల మార్క్ నో వే హోమ్‌తో రెండొందల కోట్ల రికార్డ్  ఇప్పుడు బ్రాండ్ న్యూ డేతో మూడు వందల కోట్ల నుంచి రూ. 400 కోట్ల వైపు రన్‌ అయ్యేలా కనిపిస్తోంది స్పైడర్-మ్యాన్ సిరీస్ కేవలం సూపర్ హీరో ఫ్రాంచైజీ మాత్రమే కాదు ఇండియా మార్కెట్‌ను హాలీవుడ్ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో చెప్పే ఉదాహరహణ కూడా.