Reading Time: < 1 minute

సీపీగెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీ గురుకుల విద్యార్థుల సత్తా..ఏడుగురికి స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకులు

Caption of Image.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టీజీ సీపీగెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ గురుకుల సొసైటీ డిగ్రీ కాలేజీల్లో చదివిన ఏడుగురు విద్యార్థులు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకులు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో తోట రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. శ్రావణి మొదటి ర్యాంకులు సాధించారు. 

బోటనీలో ఎం. వినీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎం. ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ర్యాంకులు సాధించగా.. జువాలజీలో జి. అనూష మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించినట్లు తెలిపారు. ఆరుగురు విద్యార్థులు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-10లో, 12 మంది టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-20లో, 18 మంది టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-50లో నిలిచారని చెప్పారు. 17 పీజీ విభాగాల్లో 32 మంది విద్యార్థులు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-100లో ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీసీ వెల్ఫేర్  కమిషనర్  బాలయాయదేవి అభినందించారు. 

©️ VIL Media Pvt Ltd.