Reading Time: 2 minutes

అమీర్ ఖాన్ భద్రత పెంపు.. బెదిరింపు కేసులో కీలక ఆధారాలు.. పోలీసులు అలర్ట్!

Caption of Image.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు వచ్చిన బెదిరింపుల వ్యవహారం రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్‌తో మొదలైన ఈ కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులతో పాటు సైబర్ దర్యాప్తు సంస్థలను కూడా అలర్ట్ చేసింది. లేటెస్ట్ ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక ఆధారాలు లభించడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే?

జూలై నెలలో సోషల్ మీడియాలో ఓ బెదిరింపు ఆడియో, ఫేస్‌బుక్ పోస్టు వైరల్ అయ్యాయి. ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి తనను ఆర్జూ బిష్ణోయ్ గా పరిచయం చేసుకుంటూ అమీర్ ఖాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా గౌరీ స్ప్రాట్‌తో ఆయన సంబంధాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ బెదిరింపులు సినీ వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

►ALSO READ | బర్త్ డే ట్రీట్ ..సర్దార్ 2’ నుంచి మాళవిక మోహనన్ స్పెషల్ పోస్టర్

లేటెస్ట్ గా పంజాబ్ పోలీసులు నిర్వహించిన ఫోరెన్సిక్ వాయిస్ అనాలిసిస్‌లో వైరల్ ఆడియోలోని గొంతు, గతంలో ఆర్జూ బిష్ణోయ్‌కు సంబంధించిన వాయిస్ శాంపిల్‌తో సరిపోలినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ వివరాలను వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు పంపించగా, అక్కడి అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

అమీర్ ఖాన్ కు భద్రత పెంపు..

బెదిరింపుల నేపథ్యంలో ముంబైలోని అమీర్ ఖాన్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ముంబై పోలీసుల సైబర్ సెల్ విచారణలో ఈ బెదిరింపుల వెనుక అత్యాధునిక టెక్నాలజీ వినియోగించినట్లు బయటపడింది. స్వీడన్‌కు చెందిన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN), ఎన్‌క్రిప్టెడ్ Tor Browser ద్వారా అసలు లొకేషన్, డిజిటల్ ఆనవాళ్లను దాచేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

దర్యాప్తు స్పీడప్..

ప్రస్తుతం వైరల్ ఆడియోను నిజంగానే ఆర్జూ బిష్ణోయ్ రికార్డ్ చేశాడా? లేక అతడి పేరును ఉపయోగించి మరెవరైనా కుట్రపూరితంగా ప్రచారం చేశారా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఆడియోను తొలిసారి సోషల్ మీడియాలో ఎవరు అప్‌లోడ్ చేశారు? అది ఎలా వైరల్ అయింది? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ బెదిరింపులపై అమీర్ ఖాన్  కానీ, ఆయన ప్రతినిధులు కానీ స్పందించలేదు. 

 

©️ VIL Media Pvt Ltd.