Reading Time: < 1 minute
Silver: బంగారం కాదు, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో చాలామంది చూపు సిల్వర్ జ్యువెలరీ వైపు మళ్లుతోంది. మన దేశంలో అత్యంత నాణ్యమైన, ఆకర్షణీయమైన వెండి నగలు అతి తక్కువ ధరకు లభించే ప్రధాన నగరం రాజస్థాన్‌లోని జైపూర్. జైపూర్ నగరం దేశంలోనే అతిపెద్ద వెండి ఆభరణాల తయారీ కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ తరతరాలుగా హస్తకళల ద్వారా వెండి నగలు తయారుచేసే వేలాది మంది కళాకారులు ఉన్నారు. తయారీదారులు, కొనుగోలుదారుల మధ్య మధ్యవర్తులు ఉండకపోవడం వల్ల ఇక్కడ నగలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు జైపూర్ నుంచే వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. జోహారీ బజార్ అనేది ఇది జైపూర్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యువెలరీ మార్కెట్. వెండి, రత్నాలు పొదిగిన నగలకు ఇది పెట్టింది పేరు. సంప్రదాయ రాజస్థానీ మోడల్స్, చేతితో చేసిన వెండి గాజులు ట్రిపోలియా బజార్‌లో చాలా చౌకగా దొరుకుతాయి.

తక్కువ బడ్జెట్‌లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, డైలీ వేర్ వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి బాపు బజార్ బెస్ట్ ఆప్షన్. సాంప్రదాయ రాజస్థానీ డిజైన్ల నుండి నేటి యూత్ ఇష్టపడే మోడర్న్ ఫ్యూజన్ డిజైన్ల వరకు ఇక్కడ లభిస్తాయి. అంతేకాకుండా రంగురంగుల విలువైన రత్నాలు పొదిగిన సిల్వర్ జ్యువెలరీకి జైపూర్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.

కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు:

వెండి నగలు కొనే ముందు తప్పనిసరిగా 925 Sterling Silver హాల్‌మార్క్ ఉందో లేదో సరిచూసుకోవాలి. హోల్‌సేల్ మార్కెట్ కాబట్టి 2-3 షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలు పోల్చి చూసి కొనుగోలు చేయడం మంచిది. మీరు కూడా తక్కువ ధరకు, మంచి నాణ్యమైన సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే జైపూర్ మార్కెట్లను తప్పక సందర్శించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.