Reading Time: 2 minutes
Sreeleela: వరుస ప్లాపులు.. బంపరాఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్!

శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్యన ఈ ముద్దుగుమ్మకు ఏదీ కలిసి రావడం లేదు. వరుస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అవి ఆశించిన మేర విజయం సాధించడం లేదు. దీనికి తోడు శ్రీలీల మధ్యలో వదిలేసిన లెనిన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గుతుందన్న రూమర్లు వినిపిస్తన్నాయి. అయితే తాజాగా శ్రీలలకు ఒక భారీ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కిందని సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్రకు ఎంపికైందని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ధర్మాన్’ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లోనే శ్రీలీలను తీసుకున్నారని టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

కాగా ఈ ఏడాది ఇప్పటికే శ్రీలీల నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీలో నటించింది శ్రీలీల. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇలాంటి తరుణంలో శ్రీలీలకు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి. శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ధర్మాన్ సినిమాలో రజనీకాంత్ డాక్టర్ గా కనిపించనున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో శ్రీలీల పాత్ర ఏంటన్నదానిపై ఆసక్తి నెలకొంది.

 

 

అరుణాచలేశ్వర ఆలయంలో శ్రీలీల పూజలు.. వీడియో

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి