Reading Time: 2 minutes

స్కాన్ చేస్తే ఎయిడ్స్ రిస్క్ తెలుస్తది..హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌కు టీజీఎస్‌‌‌‌‌‌‌‌ఏసీఎస్ డిజిటల్ ప్లాన్

Caption of Image.
  •     ఈనెల 15 నుంచి క్యూఆర్ కోడ్ సెల్ఫ్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ సేవలు
  •     పబ్లిక్ ప్లేసులు, హాస్పిటల్స్, ఆఫీసుల్లో క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ బోర్డుల ఏర్పాటు
  •     స్కాన్ చేసి.. 7 ప్రశ్నలకు ఆన్సర్ చెబితే చాలు.. రిస్క్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్
  •     హైరిస్క్ ఉంటే సమీప ఏఆర్‌‌‌‌‌‌‌‌టీ, ఐసీటీసీ సెంటర్ల వివరాలు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ (ఎయిడ్స్)పై అవగాహన పెంచడంతో పాటు కొత్త కేసులను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీఎస్‌‌‌‌‌‌‌‌ఏసీఎస్) నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీఓ) భాగస్వామ్యంతో కొత్త డిజిటల్ ప్లాన్ రెడీ చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. తమ హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ రిస్క్ ఎంత ఉందో తెలుసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈనెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు స్టార్ట్ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ సంస్థల్లో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

7 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే చాలు

క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌ను మొబైల్‌‌‌‌‌‌‌‌తో స్కాన్ చేస్తే లేదా నేరుగా www.breakfreeindia.org  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తే.. హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ రిస్క్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం 7 సింపుల్ ప్రశ్నలు వస్తాయి. లైంగిక ప్రవర్తన, సేఫ్టీ పద్ధతుల వినియోగం, సూదుల షేరింగ్ వంటి అంశాలపై అడిగే ప్రశ్నలకు అవును లేదా కాదు అని జవాబు ఇవ్వాలి. ఆన్సర్ల ఆధారంగా హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ రిస్క్ తక్కువ, మధ్యస్థం, ఎక్కువ స్థాయిలో ఉందో సిస్టమ్ చెప్తుంది. హై రిస్క్ ఉంటే.. యూజర్ లొకేషన్ ఆధారంగా దగ్గర్లోని ఐసీటీసీ టెస్టింగ్ సెంటర్లు, ఏఆర్‌‌‌‌‌‌‌‌టీ సెంటర్ల వివరాలు చూపిస్తుంది.

పూర్తి ప్రైవసీతో సేవలు

ఈ సెల్ఫ్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి పర్సనల్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా తమ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ తెచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. మీ మొబైల్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ పై వచ్చే సమాచారం మీ వరకు మాత్రమే పరిమితమవుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కు చెందిన ప్రతీ సంస్థ సామాజిక బాధ్యతగా తమ ఆఫీసుల్లో ఈ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసి ఎయిడ్స్ నివారణలో భాగస్వాములు కావాలని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు పిలుపునిస్తున్నారు. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం…  ప్రస్తుతం రాష్ట్రంలో 1.50 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. అనుమానాలు లేదా సలహాలు కావాలంటే 1097 హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయొచ్చని చెప్పారు. 

అవగాహనతోనే కంట్రోల్..

హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీపై ఉన్న భయాలు, అపోహలు తగ్గించి.. ప్రజలు తమ ఆరోగ్యంపై బాధ్యతగా ఉండేలా ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ పాజిటివ్ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో సాధారణ జీవితం గడపవచ్చు. సేఫ్ సొసైటీ నిర్మాణం లక్ష్యంగా ఈ క్యూఆర్ కోడ్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. 
– కే. విద్యాసాగర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, టీజీఎస్‌‌‌‌‌‌‌‌ఏసీఎస్

©️ VIL Media Pvt Ltd.