Reading Time: < 1 minute

రూ.10 వేల వివాదం.. ఆటో డ్రైవర్ హత్య ..హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఘటన

Caption of Image.

మలక్‌‌‌‌పేట, వెలుగు: సైదాబాద్ పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆటో డ్రైవర్‌‌‌‌ను నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సైదాబాద్​కు చెందిన ఫసి అహ్మద్ ఆమెర్ అలియాస్ చోర్  ఆమెర్(37) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్​. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సంధ్యా తండాకు చెందిన సుమన్​(22) ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆమెర్​ రెండేళ్ల క్రితం సుమన్ వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు అడిగినప్పుడల్లా బదిరింపులకు దిగాడు. దీంతో మంగళవారం సింగరేణి కాలనీలో సుమన్​ కొబ్బరిబోండాల కత్తితో ఆమెర్​ను విచక్షణారహితంగా నరికేశాడు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు
. నిందితుడు సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.