Reading Time: 2 minutes
గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..

హీలియం గ్యాస్ ఇప్పుడు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. ఎలాంటి నొప్పి లేకుండా చనిపోవాలనే ఆలోచన… ప్రాణం పోతున్నా ఏమాత్రం బాధ తెలియకూడదని హీలియం గ్యాస్ పీల్చి ప్రాణాలు వదులుతున్నారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మరీ ఈ డేంజరస్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సంతోష్ అనే యువకుడు కూడా హీలియం గ్యాస్ పీల్చి ప్రాణాలు వదిలాడు. మంగళవారం సిద్దిపేట బైపాస్ రోడ్డులోని హరిత హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్న సంతోష్.. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకుని, అప్పుల పాలు కావడంతోనే సంతోష్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సంతోష్ సూసైడ్ చేసుకోవడానికి ముందు కష్టం లేకుండా.. ఎలాంటి నొప్పి తెలియకుండా ప్రాణాలు ఎలా వదలాలి అని యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి.. చివరకు ఈ హీలియం గ్యాస్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు క్షమాపణలు చెబుతూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు సంతోష్. అంతేకాదు, ఆ గదిలోకి ఎవరైనా వస్తే గ్యాస్ ప్రభావం వారిపై పడకుండా ఉండేందుకు.. “గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు” అంటూ ఓ స్పెషల్ నోట్ రాసిపెట్టాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సంతోష్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

హీలియం గ్యాస్ పీల్చి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సురేష్ రెడ్డి

గతంలో హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. గత ఏడాది మణికొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న సురేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా హీలియం గ్యాస్ పీల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత ఏడాది విశాఖకు చెందిన అఖిల్ యువకుడు కూడా హీలియం గ్యాస్‌ పీల్చి చనిపోయాడు.

హీలియం గ్యాస్ ఏంటి? ఎందుకు ప్రాణాంతకంగా మారింది?

అసలు ఈ హీలియం గ్యాస్ ఏంటి? అది ఎందుకు ప్రాణాంతకంగా మారింది? గాలి కంటే తేలికైన హీలియం గ్యాస్‌ను సాధారణంగా బెలూన్లలో నింపేందుకు వాడతారు. దీనికి ఎలాంటి వాసన ఉండదు. బెలూన్ నుంచి ఈ గ్యాస్ పీల్చి మాట్లాడితే వాయిస్ మారిపోయి తమాషాగా ఉంటుంది. వాస్తవానికి హీలియం ప్రమాదకరం కాదు. కానీ, శరీరానికి ఆక్సిజన్ అందాల్సిన చోట.. ఆ ప్లేస్‌ను హీలియంతో రీప్లేస్ చేస్తే అది ప్రాణాల మీదకు వస్తుంది. మెదడు మొద్దుబారిపోయి, స్పృహ కోల్పోయి మృత్యువు ఒడికి చేరుకుంటారు. నొప్పి లేకుండా చనిపోవచ్చని అమెరికాలో మొదలైన ఈ డేంజరస్ ట్రెండ్.. ఇప్పుడు ఇండియాకు కూడా పాకింది. అయితే, హీలియం పీల్చి చనిపోతే ఎలాంటి నొప్పీ ఉండదనేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రాణం పోయేటప్పుడు ఎంతో కొంత పెయిన్ కచ్చితంగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. క్షణికావేశంలో యువకులు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగుల్చుతున్నాయి.

ప్రాణం విలువైనది.. క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లీదండ్రులను, కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తుంది.. ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నా.. లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఉచిత టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.. టెలి-మానస్ (Tele-MANAS): 14416 లేదా 1800-891-4416 కిరణ్ (KIRAN): 1800-599-0019 కు అలాగే.. హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్‌లైన్ (7893078930) కు సంప్రదించండి..