Reading Time: < 1 minute

ఆగష్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు…

Caption of Image.

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆగస్టు 17 నుంచి 20 వరకు నాలుగురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. గురువారం ( ఆగస్టు 8 ) సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం  తీసుకుంది ఏపీ క్యాబినెట్.

అసెంబ్లీ సమావేశాలు సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది క్యాబినెట్.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 కు ఆమోదం తెలిపింది క్యాబినెట్  గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం అనుమతి లేకుండా తీసుకొచ్చిన దిశా పోలీస్ స్టేషన్ల రద్దు, పాదచారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది క్యాబినెట్. 

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ శాఖల పనితీరు, వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల పూర్తి షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనుంది ప్రభుత్వం.

©️ VIL Media Pvt Ltd.