Reading Time: < 1 minute

గోదావరిఖని: అన్యాయంగా ఇంటిని కూల్చేశారు..మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన

Caption of Image.

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి  ఎల్కలపల్లి గేట్​సమీపంలో  తమ ఇంటిని మున్సిపల్​అధికారులు కూల్చివేశారని పేర్కొంటూ మీనుగు లక్ష్మితోపాటు ఆమె కుటుంబసభ్యులు మంగళవారం కార్పొరేషన్ ఆఫీస్​ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తనకున్న 4 గుంటల భూమిని 2021 ఏప్రిల్  కొడుకు పృథ్వీరాజ్​పేరుపై రిజిస్టర్​చేయించానని, ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇటీవల మున్సిపల్​ఆధ్వర్యంలో కూల్చివేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ విషయమై కలెక్టర్, మేయర్, కమిషనర్​కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కార్పొరేషన్​ఆఫీస్​కు వస్తే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.