Reading Time: 2 minutes
Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Gold Jewellery: బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు.. తాజాగా ఎగబాకుతోంది. తులం బంగారం ధర రూ1.50 వద్దకు చేరుకుంటోంది. ఇక మహిళలు అత్యంతగా ఇష్టపడేది నగలు. మరి తులం బంగారంతో నగలు చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంతో మీరు ఏదైనా నగలు చేయించుకుంటే ఎంత ఛార్జీలు పడతాయో తెలుసుకుందాం. ఈ ఛార్జీలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే ప్రాంతాలను బట్టి ఛార్జీలలో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల జీఎస్టీ, ఇతర ఛార్జీలలో తేడా ఉండవచ్చని గమనించండి. 24 క్యారెట్ల 10 గ్రాములతో నగలు చేయించుకున్నట్లయితే ఆగస్ట్‌ 7వ తేదీన తులం బంగారం ధర రూ.1,49,890 వద్ద కొనసాగుతోంది. దీన్ని బట్టి బంగారం విలువ+ మేకింగ్‌ ఛార్జీలు సుమారు 12 శాతం తీసుకుంటే సుమారుగా రూ.17,970, అలాగే జీఎస్టీ విలువ 3 శాతం అంటే రూ.5,036 వరకు ఉంటుంది. మొత్తం నగల తయారీకి ఛార్జీలతో కలపుకొంటే రూ.1,72,913 వరకు అవుతుందని గుర్తించుకోండి.

అదే 22 క్యారెట్ల తులం బంగారంతో నగలు చేయించుకున్నట్లయితే ప్రస్తుతం ధర రూ.1,37,400 వద్ద కొనసాగుతోంది. ఇదే ధరతో నగలు చేయించుకుంటే మేకింగ్‌ ఛార్జీలుఏ 12 శాతం (రూ.16,488), జీఎస్టీ 3 శాతం (రూ.4,617)తో మొత్తం నగల ఖర్చు 1,58,505 రూపాయల వరకు అవుతుంది.

ఇది కూడా చదవండి: Indiramma House Scheme: ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!

సాధారణంగా 22 క్యారెట్ల బంగారం 916 స్వచ్ఛత కలిగి ఉంటుంది. అంటే అందులో 91.6 శాతం మాత్రమే బంగారం ఉంటుంది. మిగితా భాగం ఇతర లోహాలు కలుపుతారు. అప్పుడే ఆ ధృడత్వం వచ్చి నగలు విరిగిపోకుండా ఉంటాయి. అందుకే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కన్నా ఈ బంగారం రేటు తక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలోని వివరాల ప్రకారం ఒక తులం అంటే 10 గ్రాములు. తులం బంగారంతో వివిధ రకాల నగలు తయారు చేస్తుంటారు. కొన్నింటి డిజైన్ క్లిష్టంగా ఉంటే కొన్ని నగలు చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంటాయి. ఇలా నగ, డిజైన్ బట్టి తరుగు అనేది 5- 15 శాతం వరకు పోతుంది. మజూరీ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  ముఖ్యంగా కుందన్, స్టోన్ వర్క్, మీనాకారి వంటి హెవీ డిజైన్లలో ఈ తరుగు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రాంతాన్ని బట్టి బంగారంలో తరుగును తీస్తుంటారు. అలాగే ఛార్జీలలో కూడా తేడా ఉంటుంది.

  1. హాల్‌మార్క్: మీరు 18-క్యారెట్ల లేదా 22, 24 క్యారెట్ల ఆభరణాలు కొన్నా, మీ నగల వ్యాపారి వద్ద HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) ఉందని నిర్ధారించుకోండి. స్వచ్ఛతకు ఇదే ఏకైక అధికారిక రుజువు.
  2. బేరసారాలకు ఆస్కారం: తయారీ రుసుము అనేది ఒక స్థిరమైన పన్ను కాదు. అది నగల వ్యాపారి లాభం. దీనిపై ఎల్లప్పుడూ బేరమాడండి. బరువైన లేదా పురాతన డిజైన్లకు తయారీ రుసుములు ఎక్కువగా ఉండవచ్చు. అందుకే మీ బడ్జెట్‌ను బట్టి తెలివిగా ఎంచుకోండి.
  3. బైబ్యాక్ పాలసీ గురించి తప్పకుండా అడగండి: మీరు ఈరోజు కొనుగోలు చేస్తున్న ఆభరణాలను రేపు అమ్మవలసి వస్తే లేదా మార్పిడి చేసుకోవలసి వస్తే, నగల వ్యాపారి ఎంత శాతం తగ్గింపు ఇస్తారు? బిల్లు రాసే ముందే దీనిని ఖరారు చేసుకోండి.
  4. వివరమైన ఇన్వాయిస్: ముసాయిదా బిల్లును అంగీకరించవద్దు. బంగారం ధర, స్వచ్ఛత, బరువు, తయారీ ఛార్జీలు, GST పూర్తి వివరాలను స్పష్టంగా పేర్కొనే వివరమైన బిల్లును అడగండి. ఈ పారదర్శకత తర్వాత మీకు బాగా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: IRCTC: ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి