Reading Time: 2 minutes
Credit Score: లోన్ ముందే చెల్లిస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుందా..? ఎవరూ చెప్పని అసలు లెక్కలివే.. అలా చేస్తేనే బెనిఫిట్..

ఆర్ధిక అవసరాల కోసం చాలామంది బ్యాంకుల నుంచి వివిధ రుణాలు తీసుకుంటారు. కొంతమంది ఆలస్యంగా చెల్లిస్తే.. మరికొంతమంది లోన్ గడువు ముగియకముందే చెల్లిస్తూ ఉంటారు. దీని వల్ల వడ్డీ భారం అనేది తగ్గడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. అంతేకాకుండా త్వరగా మీరు రుణం నుంచి బయటపడటం వల్ల ఆందోళన తగ్గుతుంది. అలాగే ఈ నిర్ణయం మీకు నెలవారీ నగదు ప్రవాహాన్ని అందుబాటులోకి తెస్తుంది. అయితే రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇది నిజమేనా? కాదా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీనిపై బ్యాంకింగ్ నిపుణులు ఏం అంటున్నారు? ముందే చెల్లించడం వల్ల బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ స్కోర్‌ వెంటనే పెరుగుతుందా..?

ముందు లోన్ చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ పెరుగుతుదంని స్పష్టంగా చెప్పలేమని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందుగానే తిరిగి చెల్లించడం అనేది ఆర్థిక క్రమశిక్షణను పెంచడంతో పాటు బాధ్యతాయుతమైన రుణగ్రహణాన్ని ప్రతిబింబింబిస్తుంది. దానివల్ల మీ క్రెడిట్ స్కోరులో తక్షణ పెరుగుదల వస్తుందని చెప్పలేమని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంటున్నారు. కేవలలం తిరిగి చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగ నిష్పత్తి, క్రెడిట్ మిక్స్, చెల్లించాల్సిన అప్పు, మీ క్రెడిట్ చరిత్ర నిడివితో పాటు అనేక అంశాలు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి. లోన్ ముందుగానే చెల్లించడం లేదా మూసివేయడం వల్ల కాలక్రమేణా స్థిరమైన ఆర్థిక ప్రవర్తన పెరుగుతుంది. దీని వల్ల మీ రుణ అర్హత ఏర్పడుతుంది.

ఆర్ధిక ప్రొఫైల్ మెరుగుపడే అవకాశం

రుణాన్ని ముందుగానే చెల్లించడం వల్ల మీ ఆర్థిక ప్రొఫైల్‌ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా సకాలంలో చెల్లింపులు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన క్రెడిట్ అలవాట్లను పాటించడం వల్ల కాలక్రమేణా మీ క్రెడిట్ స్కోర్ బలోపేతం అవుతుంది. అయితే క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు ముందుగా చెల్లించడం అనేది ఒక మార్గంగా భావించవద్దని నిపుణులు చెబుతున్నారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ కోసం దీర్ఘకాలంలో స్థిరమైన తిరిగి చెల్లింపు క్రమశిక్షణ. క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం అవసరమని అంటున్నారు. గృహ రుణాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందది. గృహ రుణాన్ని ముందుగానే చెల్లించడం వల్ల చెల్లించే మొత్తం వడ్డీ గణనీయంగా తగ్గుతుంది. అయితే దీనిని మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరిచే ఖచ్చితమైన మార్గంగా భావించకూడదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో త్వరగా లోన్ చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ వెంటనే పెరగదు. అనేక అంశాలు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావితం చూపిస్తాయి.