
Gas Level Tips: ఎల్పీజీ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో చెప్పడం తరచుగా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతుంటుంది. అలాంటి సమయంలో వంట చేయడం నిలిచిపోతుంది. కేవలం ఒకే సిలిండర్ ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో రీఫిల్ కోసం 2-3 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. కొన్ని నగరాల్లో ఈ నిరీక్షణ కొన్ని రోజుల వరకు కూడా ఉండవచ్చు.
మీరు ఇలాంటి సమస్యను నివారించాలనుకుంటే మీ సిలిండర్ అయిపోకముందే దాన్ని కనుక్కోవాలి. దీనికోసం మీరు కేవలం రెండు సులభమైన చిట్కాలను పాటించాలి. ఇందులో మీకు ఆ రెండు ట్రిక్స్ గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే!
LGP గ్యాస్ కొరతను గుర్తించడానికి వేడి నీటిని ఉపయోగించండి:
వేడి నీటిని ఉపయోగించి కేవలం కొన్ని సెకన్లలోనే ఎల్‌పిజి గ్యాస్ అయిపోవడాన్ని గుర్తించవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. మీకు కావలసిందల్లా ఒక గ్లాసు వేడి నీళ్ళు మాత్రమే.
- ఈ చిట్కాను ప్రయత్నించడానికి ముందుగా ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి.
- ఇప్పుడు ఈ నీటిని సిలిండర్ బయటి ఉపరితలంపై పై నుండి కిందికి నెమ్మదిగా పోయండి.
- వేడి నీళ్ళు పోసిన తర్వాత సుమారు 10 సెకన్ల పాటు ఆగండి.
- సుమారు 10 సెకన్ల తర్వాత మీ చేతితో సిలిండర్‌ను తేలికగా తాకడానికి ప్రయత్నించండి.
సిలిండర్ ఉపరితలం ఎక్కడైతే మీకు చల్లగా అనిపిస్తుందో అక్కడ ఇంకా ఎల్‌పిజి గ్యాస్ ఉంటుంది. ఎందుకంటే సిలిండర్ లోపల ఉన్న ద్రవరూప గ్యాస్ బయటి వేడిని గ్రహించి, ఆ ప్రాంతాన్ని చల్లబరుస్తుంది. అయితే గ్యాస్ బయటకు వెళ్ళిపోయిన చోట, సిలిండర్ బయటిభాగం త్వరగా వేడిగా అనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: Car Loan: రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ కొంటే EMI ఎంత ఉంటుంది?
మీరు తడి గుడ్డ సహాయంతో..
- వేడి నీటితో పాటు, తడి దూది గుడ్డ సహాయంతో కూడా ఎల్‌పిజి గ్యాస్ తరిగిపోవడాన్ని మీరు తనిఖీ చేయవచ్చు. ఉదాహరణకు..
- ఎంత LGP గ్యాస్ అయిపోయిందో తెలుసుకోవడానికి ముందుగా ఒక తడి దూది గుడ్డను తీసుకోండి.
- ఇప్పుడు ఈ తడి గుడ్డను గ్యాస్ సిలిండర్ చుట్టూ పై నుండి కిందికి చుట్టి, 1 నుండి 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి.
- 1 నుండి 2 నిమిషాల తర్వాత సిలిండర్ నుండి వస్త్రాన్ని తీసివేయండి.
- సిలిండర్‌లో పొడిగా కనిపించే భాగంలో గ్యాస్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ భాగం వేడిగా ఉంటుంది.
- అదే సమయంలో మీకు ఏ భాగం తడిగా, చల్లగా అనిపిస్తుందో అది గ్యాస్‌తో నిండి ఉందని అర్థం చేసుకోండి.
ఈ రెండు చిట్కాలతో పాటు గ్యాస్ అయిపోతోందో లేదో తెలుసుకోవడానికి మీరు LPG సిలిండర్ బరువును కూడా తనిఖీ చేయవచ్చు. అంతేకాకుండా మంట నీలం రంగుకు బదులుగా లేత పసుపు, నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తే, దాని ద్వారా కూడా సిలిండర్‌లో గ్యాస్ అయిపోతోందో లేదో నిర్ధారించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: OnePlus Discount: వన్‌ప్లస్ బంపర్ ఆఫర్.. ఊహించని విధంగా భారీ తగ్గింపు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి