Reading Time: < 1 minute
Buchi Babu Sana Turns Producer Launches New Hero Peddi Director

Buchi Babu: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇటీవల ఆయన పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అయితే తాజాగా బుచ్చిబాబు సానాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు తొలిసారి నిర్మాతగా మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఆయన ఉన్నారని, దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఈ సినిమా ద్వారా తన బంధువుల కుటుంబానికి చెందిన ఓ యువకుడిని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారనే వార్త కూడా జోరుగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు నిర్మాతగా మారారనే వార్తలు బయటికి రావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక బయటికి రావాల్సి ఉంది.