
‘చెన్నై లవ్ స్టోరీ’ విజయంతో ఎంతో సంతోషంగా ఉన్నానని రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవడం హ్యాపీగా ఉందని, కథాపరంగా కలర్ ఫొటో, బేబి కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింని చెప్పారు. ప్రస్తుతం దర్శకుడిగా ‘బేబి’ హిందీ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నానని అన్నారు. మరో 20 రోజులే షూటింగ్ మిగిలి ఉందని, సెప్టెంబర్ చివరినాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ఈ ఏడాది అక్టోబర్ తర్వాత తన దర్శకత్వంలో కొత్త తెలుగు సినిమాను అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు.