
డయల్ 112 సేవలను మరింత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఎమర్జెన్సీకి అన్నింటికి ఒకే నంబర్ 112 ను ప్రారంభించారు సీవీ ఆనంద్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్ బీ లోని రెండు అంతస్తులను కేవలం డయల్ 112 కోసమే కేటాయించినట్లు తెలిపారు. అత్యవసరంగా వచ్చే ఏ ఒక్క కాల్‌ను కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
2013లో జీవీకే సహకారంతో ప్రారంభమైన డయల్ 100 ప్రయాణం నుంచి నేడు దేశం కోరుకుంటున్న సింగిల్ ఎమర్జెన్సీ నంబర్ కాన్సెప్ట్ వరకు తెలంగాణ పోలీస్ శాఖ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇది అత్యాధునిక 3.0 వెర్షన్‌గా రూపాంతరం చెందుతోందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డ్రోన్ సిస్టమ్‌లను రంగంలోకి దించుతున్నట్లు డీజీపీ తెలిపారు. డయల్ 112 కు కాల్ రాగానే కాలర్ కచ్చితమైన లొకేషన్‌ను ట్రేస్ చేయడానికి అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్ వాడుతున్నారని వెల్లడించారు.. అంతేకాదు, త్వరలోనే డ్రోన్ బేస్డ్ టెక్నికల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి, ప్రత్యేకంగా డ్రోన్ టీమ్స్ ను కూడా ఫామ్ చేయబోతున్నామన్నారు. బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు యువ ఐపీఎస్ అధికారులను, టెక్నాలజీ నిపుణులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం అని డీజీపీ వెల్లడించారు.