Reading Time: < 1 minute

నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం..జీఆర్ఎంబీ ప్రతిపాదనల్ని అడ్డుకోవాలి : హరీశ్ రావు

Caption of Image.

సిద్దిపేట, వెలుగు : తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి సీఎం కావడం వల్లే నదీ జలాల్లో అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలన్న ఏపీ సూచనలను జీఆర్ఎంబీ ఏజెండాలో చేర్చారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 

 ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేందుకు ఒత్తిడి తేవాలన్నారు. 

ఏపీలో కడుతున్న బనకచర్ల ప్రాజెక్టును ఎందుకు ఆపలేకపోతున్నారని, సమ్మక్కసాగర్ కు కేటాయించిన నీటిని ఎందుకు వదులుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అనంతరం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ సబ్ స్టేషన్ ను తనిఖీ చేసి లాక్ బుక్ ను  పరిశీలించారు. రాఘవపూర్ గ్రామంలో త్రీఫేస్ కరెంటు కేవలం 10.30 గంటలే ఇస్తున్నారని, 24 గంటల కరెంట్ కు  రేవంత్ రెడ్డి మంగళం పాడారని విమర్శించారు. 

 

©️ VIL Media Pvt Ltd.