Reading Time: 2 minutes

ప్రీ ప్రైమరీ స్కూళ్లకు కొత్త టైమింగ్స్?..సాయంత్రం 4 వరకు క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ 

Caption of Image.
  • సాయంత్రం 4 వరకు క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ 
  • కమిటీ రిపోర్ట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ప్రీ ప్రైమరీ స్కూళ్ల టైమింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న టైమింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పేరెంట్స్ పడుతున్న ఇబ్బందులు, ప్రైవేటు స్కూళ్లతో పోటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. దీనిపై అధ్యయనం చేసేందుకు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా మధ్యాహ్నం దాకానే పెట్టాలా.. లేదా సాయంత్రం దాకా పొడగించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,131 సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 65 వేల మందికి పైగా చిన్నారులు ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, ఈ స్కూళ్ల పనివేళలు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. జిల్లాల్లోని స్కూళ్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 గంటలకే మొదలై, మధ్యాహ్నం 12 గంటలకే ముగిస్తున్నాయి.

పేరెంట్స్ నుంచి భారీగా విజ్ఞప్తులు..

గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్నానికే బడి వదిలేయడంపై పేరెంట్స్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారని, అక్కడైతే పిల్లలు సురక్షితంగా ఉంటారనే నమ్మకం ఉందని వారు చెబుతున్నారు. తాము పనులకు వెళ్తే.. మధ్యాహ్నం 12 గంటలకే ఇంటికి వచ్చే పిల్లలను ఎవరు చూసుకోవాలని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండాల్సి వస్తోందని, దీనితో రక్షణ లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లోనూ సాయంత్రం 4 గంటల వరకు టైమింగ్స్ పెంచాలని టీచర్లు, పేరెంట్స్ నుంచి విద్యాశాఖకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రత్యేక కమిటీని వేశారు.

కమిటీలో ఎవరెవరున్నారంటే?ఈ కమిటీలో స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు, ఇద్దరు డీఈఓలు, ఇద్దరు ఎంఈఓలతో పాటు మరో ఇద్దరు ఎల్ఎఫ్ఎల్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు సభ్యులుగా ఉన్నారు. టైమింగ్స్ సాయంత్రం వరకు పెంచితే పిల్లలకు కావాల్సిన మధ్యాహ్న భోజనం, ఇతర వసతులు ఎలా ఉండాలి?, ఆ పిల్లల పర్యవేక్షణ ఎవరు ఎలా చేయాలి?, అదనపు పనివేళల వల్ల టీచర్లపై పడే భారం ఏంటి అనే అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక రాగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. 

©️ VIL Media Pvt Ltd.