Reading Time: 2 minutes

జ్యోతిష్యం: ఆగస్టు 9 చాలా పవర్ఫుల్ డే .. ఆరోజు ఏ రాశి వారు ఏం చేయాలి..

Caption of Image.

హిందూ ధర్మంలో ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది.  పురాణాల ప్రకారం ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.  ప్రతి నెలలో రెండు ఏకాదశులు వచ్చినా.. ప్రతి ఏకాదశికి ప్రాముక్యత.. విశిష్టత వేరు వేరుగా ఉంటుంది.  ఈఏడాది  ఆగస్టు 9 న కామిక ఏకాదశి వచ్చింది. ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించి విష్ణుమూర్తిని పూజిస్తే  పాపాలు హరించి..ఐశ్వర్యం.. సంతానం  వృద్ది జరుగుతుందని పండితులు చెబుతున్నారు.   ఆగస్టు 9 ఆదివారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .! 

కామిక ఏకాదశి ( 2026 మార్చి 29)  విష్ణుమూర్తిని పూజిస్తే.. ఆయన అనుగ్రహం మెండుగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు కామద ఏకాదశి ఉపవాస వ్రతం.. బ్రహ్మహత్య వంటి దారుణ పాపాల నుంచి కూడా విముక్తిని ఇస్తుందంటున్నారు పండితులు.  లక్ష్మీనారాయణులకు తులసిదళాలతో పూజించాలి.  ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉంది. 

కామిక ఏకాదశి తిథి వివరాలు

  • కామిక ఏకాదశి తిథి ప్రారంభం:  ఆగస్టు 8వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:59 గంటలకు
  • కామిక ఏకాదశి తిథి ముగింపు:  ఆగస్టు 9 వ తేది ఆదివారం న ఉదయం 11:04 గంటలకు 
  • ఉదయం తిథి ప్రకారం ఆదివారం.. ఆగస్టు 9 వ తేదీన  రోజున కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

మేష రాశి :  ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కామికా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు గులాబీ పువ్వును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు

వృషభ రాశి  : ఈ రాశికి  శుక్రుడు అధిపతిగా ఉంటాడు,  శ్రీ మహావిష్ణువుకు పాలతో చేసిన మిఠాయిలను సమర్పించొచ్చు. ఇది చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. గా పరిగణించబడుతుంది.

మిథున రాశి: ఈ  రాశి వారు కామికా ఏకాదశి రోజున తులసి ఆకులను విష్ణువుకు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సుకలుగుతాయి.

కర్కాటక రాశి: ఈ  రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కామికా ఏకాదశి రోజున స్వామి వారికి ఏదైనా తీపి పదార్థాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది.

సింహ రాశి:  ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కామికా ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువుకు పంచామృతం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితం మెరుగుడుతుంది. 

ALSO READ : ఆదివారం ( ఆగస్టు 9) చాలా విశిష్టమైన రోజు.. మాంసం.. మద్యానికి దూరంగా ఉండండి..

కన్య రాశి:  ఈ  రాశి వారు కామికా ఏకాదశి వేళ శ్రీ మహా విష్ణువుకు నెమలి ఫించాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి ఉపశమనం కలగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

తుల రాశి:ఈ రాశి వారు కామికా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు గవ్వలు సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. పెండింగ్​ సమస్యలు పరిష్కారమవుతాయి. 

వృశ్చిక రాశి: ఈ  రాశి వారు కామికా ఏకాదశి వేళ శ్రీ మహా విష్ణువుకు కుంకుమ సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసేపనుల్లో మంచి విజయం లభిస్తుంది. 

ధనస్సు రాశి:  ఈ  రాశి వారు కామికా ఏకాదశి వేళ శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మకర రాశి: ఈ రాశి వారు  కామికా ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు జమ్మి ఆకులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

కుంభ రాశి: ఈ రాశి వారు కామికా ఏకాదశి వేళ శ్రీ మహా విష్ణువుకు పూజ చేసే సమయంలో పసుపును కచ్చితంగా వాడాలి. ఇలా చేయడం వల్ల గ్రహాల దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

మీన రాశి: ఈ  రాశి వారు కామికా ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు పసుపురంగు వస్త్రాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో విభేదాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం..

©️ VIL Media Pvt Ltd.