Reading Time: 2 minutes

జ్యోతిష్యం: సూర్యగ్రహణం రోజు చతుర్గ్రహ యోగం.. ఈ రాశుల వారికి జాక్ పాట్!

Caption of Image.

జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది (2026) ఆగస్టు​ నెల చాలా ముఖ్యమైనది.  ఆగస్టు 12 వ తేది ఆషాఢ అమావాస్య .. సూర్యగ్రహణం రోజు  శక్తివంతమైన నాలుగు గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు గ్రహాలు  కలిసి  ఒకే రాశిలో సంచరిస్తున్నాయి.దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అయితే నాలుగు రాశుల  ( వృషభ, కర్కాటక,సింహ, కుంభ)వారు అదృష్టం కలిసి వచ్చిజాక్​ పాట్​తగిలిన వారి మాదిరిగా జీవితం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఇప్పుడు ఆ రాశుల గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. .!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఆషాఢ అమావాస్య.. సూర్యగ్రహణం రోజు  సూర్యుడు, బుధుడు, శుక్రుడు , కుజు డువంటి కీలక గ్రహాల సంచారాలు, వాటి కలయికతో ఏర్పడే శుభ యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అనేక అంశాల్లో సానుకూల మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి  : ఈ రాశి వారికి  సూర్యగ్రహణం  నుంచి బాగా కలిసొస్తుంది. సూర్యుడు, కు జుడు, బుధుడు, శుక్రుడు  గ్రహాల కలయిక వీరికి  కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబం నుంచి స్నేహితుల నుంచి సపోర్టు లభిస్తుంది. ఉద్యోగస్తులకు  విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి.  అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం పుష్కలంగా ఉంటుంది. ప్రశంశలు అందుకొనే అవకాశం ఉంటుంది.వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా  అనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు  లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు.. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి  చతుర్గ్రహి యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వీరి జీవితం మెరుగుపడుతుంది.  కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.  తక్కువ శ్రమ..ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. సమాజంలో  గౌరవం, గుర్తింపు పెరుగుతుంది.  ఉద్యోగం కోసం చూస్తున్న వారికి  పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. పనిచేసే చోట ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక ఇంట్లో దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది.  ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.

కర్కాటక రాశి : ఒక పక్క సూర్య గ్రహణం..  మరోపక్క చతుర్గ్రహి యోగం వలన  ఈ రాశి వారికి సానుకూల మార్పులు కలుగుతాయి. మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. అతి కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కుంభ రాశి :  చతుర్గ్రహ యోగం వలన ఈ రాశి వారికి  మరింత సంపద చేతికి అందుతుంది. డబ్బును పెంచుకోవడానికి చేసే వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో పరిష్కారం కాని ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి.  ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి  బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం

©️ VIL Media Pvt Ltd.