
హైదరాబాద్: ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే లీడ్ రోల్ ప్లే చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం (ఆగస్ట్ 6) పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, సీవీఎన్ పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశంలో పబ్లిక్ రిలేషన్స్ (PR) రంగానికి డాక్టర్ సి.వి. నరసింహ రెడ్డి విశేష కృషి చేశారని అన్నారు.
ఆయన జయంతి రోజున నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తాను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు నర్సింహారెడ్డి గురించి చాలా విన్నానని.. పత్రికల్లో ఆయన ఆర్టికల్స్ చదివే వాడినని తెలిపారు. తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ జనరేషన్లో.. నర్సింహారెడ్డి కుటుంబసభ్యులు ఆయనను గుర్తు పెట్టుకొని సామాజిక సేవ చేయడం అభినందనీయమన్నారు.
పాజిటివ్ వార్తలు కంటే నెగిటివ్ వార్తలు ఇష్ట పడే రోజుల్లో ఉన్నామని.. ఇలాంటి సమయాల్లో పీఆర్ చాలా కీలకమని పేర్కొన్నారు. పీఆర్ ప్రతీ వ్యవస్థకు ఫౌండేషన్ అని.. సమాజంలో పీఆర్ ఎండ్ కమ్యూనికేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో పీఆర్ వ్యవస్థ కీలక రోల్ ప్లే చేస్తుందని చెప్పారు. ప్రతీ ఒక్క పీఆర్ ట్రస్ట్, ట్రూత్, ట్రాన్స్పరెసీ ఈ మూడింటిని ఫాలో అవ్వాలని సూచించారు.
సీఎం రేవంత్ కూడా మాకు పీఆర్ విషయంలో యాక్టివ్‌గా ఉండాలని సూచిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కు పెద్దపీట వేస్తుందని.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేస్తుందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. పీఆర్ షార్ట్ టర్మ్ కోర్స్ కూడా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.