Reading Time: 2 minutes

ఈసారైనా కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో.. మెడికల్ క్లాసులు జరిగేనా ?

Caption of Image.
  • కరీంనగర్ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు
  • పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్, గ్రౌండ్ లెవలింగ్ పనులు
  • హాస్టల్, క్లాస్ రూమ్ సౌకర్యాలు సరిగాలేక మెడికోలకు తప్పని తిప్పలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్ల కింద ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా మార్బుల్, టైల్స్, కిటికీలు, డోర్లతోపాటు ఎలక్ట్రికల్, సీలింగ్ లాంటి ఇంటిరీయర్ వర్క్ పూర్తిగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. దీంతో మెడికల్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. సీడ్ గోదాముల్లో క్లాసులు వింటూ, బయట దూరంగా ప్రైవేట్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ హాస్టళ్లలో ఉంటూ ఇబ్బందులకు గురువుతున్నారు. 

జూన్ 16న కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద తమ గోడు వెళ్లబోసుకోగా.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. ఇప్పటికే నెలన్నర దాటినా పనులు పూర్తి కాలేదు. లోపల పనులు జరిగే తీరును చూస్తే ఇంకా ఆర్నెళ్లయినా  అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

సీడ్ గోదాముల్లో క్లాసులు..

2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని నగర శివారులోని కొత్తపల్లిలోని సీడ్ గోదాముల్లో ప్రారంభించారు. గోదాములను క్లాసు రూమ్ లుగా తీర్చిదిద్దేందుకు రూ.7 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో మొదటి, రెండో బ్యాచ్ ల్లో 100 మంది చొప్పున అడ్మిషన్ పొందారు. త్వరలో మూడో బ్యాచ్ అడ్మిషన్లు కానున్నాయి. దీంతో కాలేజీ విద్యార్థుల సంఖ్య 300కు చేరనుంది. ఇప్పటికే హాస్టల్, క్లాస్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ల విషయంలో మెడికోలు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. 

కాలేజీలకు ఇంకా హాస్టల్స్ నిర్మాణం పూర్తికాకపోవడంతో అద్దె భవనాల్లో నడిచే హాస్టళ్లలో ఉంటున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తీగలగుట్టపల్లిలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్ లో రెండు బ్యాచ్ లకు చెందిన 84 మంది గర్ల్స్‌‌‌‌‌‌‌‌కు ఒకేచోట వసతి కల్పించారు. వారికి అక్కడ సరైన వసతులు లేవు. బాయ్స్‌‌‌‌‌‌‌‌లో ఒక బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు విద్యానగర్, మరో బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు శ్రీపురం కాలనీలో హాస్టల్స్​ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో 100 మంది చేరితే మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంత మందికి ఒక మినీ బస్సు మాత్రమే ఏర్పాటు చేయగా.. మూడు, నాలుగు ట్రిప్పులు వేస్తేగానీ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

25 ఎకరాల్లో కాలేజీ బిల్డింగ్.. 

కొత్తపల్లిలో ప్రస్తుతం మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్న ప్రాంతానికి పక్కనే 25 ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.138 కోట్లు కేటాయించింది. అగ్రిమెంట్ ప్రకారం.. ఏడాదిలోనే ఈ కాలేజీ భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బయటికి బిల్డింగ్ పూర్తయినట్లు కనిపిస్తున్నా.. లోపల ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. బయట గ్రౌండ్ లెవలింగ్, లోపల ఫ్లోరింగ్ పనులతోపాటు ఎలక్ట్రికల్, సీలింగ్ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. త్వరగా పనులు పూర్తి చేసి బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని మెడికల్ కాలేజీ విద్యార్థులు కోరుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.