Reading Time: 2 minutes
Jbl Live Buds 4 And Live Beam 4 Launched In India With Anc 2 0 Hi Res Audio Up To 48 Hour Battery

JBL Live Buds 4, Live Beam 4: భారత మార్కెట్లో JBL నుండి కొత్తగా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ JBL లైవ్ బడ్స్ 4 (JBL Live Buds 4), JBL లైవ్ బీమ్ 4 (JBL Live Beam 4)లను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో 10mm డైనమిక్ డ్రైవర్లు, ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సలింగ్ (ANC) 2.0, Hi-Res ఆడియో, JBL సిగ్నేచర్ సౌండ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ JBL ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Hi-Res ఆడియో:

రెండింటిలోనూ 10mm Dynamic Driversను అందించారు. అలాగే Hi-Res ఆడియో, JBL స్పటియాల్ సౌండ్, Personi-Fi 3.0, పర్సనల్ సౌండ్ ఆమ్ప్లిఫికేషన్, లో వాల్యూం EQ, JBL సిగ్నేచర్ సౌండ్ ట్యూనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే.. Live బడ్స్ 4 సాధారణ ఇన్-ఇయర్ సిలికాన్ టిప్స్‌తో వస్తుండగా.. Live బీమ్ 4 స్టెమ్ డిజైన్‌తో ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌గా అందుబాటులోకి వచ్చింది.

AI కాల్ క్వాలిటీ:

ఈ రెండు మోడళ్లలోనూ 4-మైక్ ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సలింగ్ 2.0 టెక్నాలజీ ఉంది. అయితే JBL లైవ్ బీమ్ 4లో అదనంగా స్మార్ట్ టాక్ విత్ అడాప్టివ్ ANC 2.0 ఫీచర్‌ను అందించారు. అలాగే రెండు మోడళ్లలో 6-మైక్రోఫోన్ పర్ఫెక్ట్ కాల్స్ 2.0, AI ఆధారిత కాల్ ఎక్వలైజర్, సౌండ్ లెవెల్ ఆప్టిమైజర్ వంటి ఫీచర్లు ఉండటంతో కాల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి. టచ్ కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

బ్యాటరీ:

బ్యాటరీ పరంగా JBL Live Buds 4లో ANC ఆన్‌లో 32 గంటల వరకు, ANC ఆఫ్‌లో 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఇక JBL Live Beam 4లో ANC ఆన్‌లో 40 గంటల వరకు, ANC ఆఫ్‌లో 48 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందుతుందని JBL తెలిపింది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ పొందవచ్చు. ఛార్జింగ్ కేస్ వైర్‌లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ధర:

భారత మార్కెట్లో JBL లైవ్ బడ్స్ 4, JBL లైవ్ బీమ్ 4 ధర రూ. 24,999గా నిర్ణయించారు. JBL లైవ్ బడ్స్ 4 బ్లాక్, బ్లూ, సాండ్, సిల్వర్ రంగుల్లో లభిస్తుండగా, JBL లైవ్ బీమ్ 4 బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, సాండ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం JBL ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.