Reading Time: < 1 minute

తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగ అవకాశాలు.. మొత్తం 19 పోస్టులు.. పూర్తి వివరాలివే!

Caption of Image.

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)  ప్యానెల్ అడ్వకేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: ప్యానెల్ అడ్వకేట్.

మొత్తం ఖాళీలు: 19.

విభాగాల వారీగా ఖాళీలు: హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ 06, క్యాట్ – హైదరాబాద్ 3, ఈఐ కోర్ట్ 8, ఎంఎం కోర్ట్ (సీక్యూ బౌన్స్ కేసెస్) 2. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్​బీ పూర్తిచేసి ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్‌‌‌‌లో సభ్యత్వం కలిగి ఉండి, నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండాలి.

అప్లికేషన్: ఆఫ్ లైన్ ద్వారా.

రీజనల్ డైరెక్టర్ (లీగల్), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రీజనల్ ఆఫీస్, తెలంగాణ, హిల్ ఫోర్ట్ , ఆదర్శ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ – 500063 చిరునామాకు అప్లికేషన్లు పంపించాలి. 

లాస్ట్ డేట్: ఆగస్టు 14. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎక్స్​పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే  ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ rotelangana.esic.gov.inను సందర్శించండి.
 

©️ VIL Media Pvt Ltd.