Reading Time: < 1 minute

రాపిడ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

Caption of Image.

సెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా) :  ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద.. సెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం 18 పాయింట్లకు గాను 12 పాయింట్లు సాధించాడు. ఫలితంగా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు. 9 రౌండ్ల ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో ప్రజ్ఞానంద అద్భుతమైన టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూపెట్టాడు. 4 విజయాలు, 4 డ్రాలు నమోదు చేసి.. చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జోర్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడాడు. అయినప్పటికీ ఒక పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. జావోఖిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (11) రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. వెస్లీ సో (11) మూడో స్థానంలో నిలిచాడు. బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు ముగిసిన తర్వాత ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తారు.
 

©️ VIL Media Pvt Ltd.