
కేరళలోని కొట్టాయంలో అత్యంత అరుదైన, ఆసక్తికరమైన వివాహ వేడుక ఒకటి జరిగింది. ఇద్దరు కవల అన్నదమ్ములు, మరో కవల అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కొట్టాయం చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చిలో జరిగిన ఈ పెళ్లి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మర్చంట్ నేవీలో పనిచేస్తున్న కవల సోదరులు అఖిల్, నిఖిల్‌లకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కవల సోదరీమణులు మ్యాగీ, మారియాలతో వైభవంగా వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లిలో అసలైన విశేషం ఏమిటంటే.. వివాహ తంతు జరిపించిన ఫాదర్ ఆంటో, ఫాదర్ ఆజోలు కూడా కవలలే! అంతేకాదు, వారికి సహాయకులుగా వ్యవహరించిన ఇద్దరు కుర్రాళ్లు కూడా కవల సోదరులు కావడం విశేషం. కవలలనే పెళ్లి చేసుకోవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నామని, ఇప్పుడు తమ కోరిక తీరిందని ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే పెళ్లి జరిపించేందుకు కవలలైన మత పెద్దలను వెతకడానికే కాస్త సమయం పట్టిందని చెప్పారు. అంతా కవలమయంగా సాగిన ఈ పెళ్లిని చూసి, ఇదొక అద్భుతమైన అసాధారణ వేడుక అంటూ అతిథులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య.. షాకింగ్ నిజం చెప్పిన డ్రైవర్
ఏపీలో మహిళలకు ఫ్రీగా లక్ష పట్టుచీరలు! ఊరూరూ తిరిగి పంచుతున్న బీజేపీ నేత