ఎండు చేప vs తాజా చేప: ఏది బెస్ట్? : రెండు చేపలు, టేస్ట్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. ఆరోగ్య నిపుణులు మాత్రం తాజా చేపలకే ఎక్కవ ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తాజా చేపలల్లో మాత్రమే సహజ సిద్ధమైన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు చురుకుదనానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. తాజా చేపలలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది హై బిపి ఉన్నవారికి కూడా చాలా సురక్షితమైన ఎంపిక.
ఎండు చేపలు ఆరోగ్యకరమైనవేనా:అయితే ఎండు చేపలు ఆరోగ్యమైనవి కావా అంటే.. ఇందులో కూడా పోషకాలు ఉంటాయి. కానీ చేపల నుండి నీటిని తొలగించి ఎండబెట్టడం వల్ల వీటిలో ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు చాలా గాఢతతో ఉంటాయి. కాబట్టి తక్కువ చేపటు తిన్నా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. అయితే వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కోసం అధికంగా ఉప్పును వాడుతారు. కాబట్టి బీపీ ఉన్నవారికి ఇది మంచిదికాదు. గుండే ఆరోగ్య సమస్యలను ఇంకా పెంచుతుంది
హానికరమైన రసాయనాలు: తాజా చేపలతో పోల్చుకుంటే ఎండు చేపల్లో హానికరమైన రసాయనాలు ఉండొచ్చు. ఎందుకంటే వీటిని ఎక్కవ రోజులు స్టోర్ చేయడానికి కొన్నిసార్లు హానికరమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఈ కెమికల్స్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు కొన్ని సార్లు వీటిని అపరిశుభ్రమైన వాతావరణంలో ఎండబెడితారు. కాబట్టి వీటిపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చేరి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
సముద్రంలో దొరికే పెద్ద చేపలను ఎండబెట్టినప్పుడు వాటిలో ఉండే మెర్క్యురీ వంటి భార లోహాల సాంద్రత పెరుగువచ్చు. ఇది గర్భిణులు, పిల్లలకు హానికరం. అలాగే ఎండబెట్టే క్రమంలో నీటిలో కరిగే విటమిన్లు తగ్గిపోతాయి. కాబట్టి వీరు ఎండు చేపలకు దూరంగా ఉండడమే మంచిది. అయితే తాజా చేపలు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద ప్రిజ్‌లో నిల్వ చేయకపెతే త్వరగా పాడయే అవకాశంఉంది. కాబట్టి సరైన పద్ధతిలో నిల్వ చేసి వండి తింటే తాజా చేపలే ఆరోగ్యానికి అత్యుత్తమ ఎంపిక.
ఏది ఎంత తినాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూవారీ ఆహారంలో తాజా చేపలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎండు చేపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని.. కేవలం పరిమితంగా మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారు వీటిని తగ్గించాలి. వండే ముందు ఎండు చేపలను కాసేపు నీటిలో నానబెట్టి, ఉప్పును తీసివేసి వండుకోవడం మంచిదని సూచిస్తున్నారు.




