జీర్ణ వ్యవస్థకు దివ్యౌషధం: దబ్బకాయ ఆకులు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటితో చేసిన కషాయం లేదా టీ తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. తరచూ వేధించే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వికారం, వాంతులు తగ్గించడంలో: ప్రయాణాల సమయంలో వచ్చే వాంతులు, ప్రసూతి సమయంలో మహిళలు ఎదుర్కొనే మార్నింగ్ సిక్నెస్ నివారణకు ఈ ఆకుల సువాసన, కషాయం ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది శరీరంలో పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది.
మానసిక ప్రశాంతత, నిద్రలేమి: ఈ ఆకుల్లో సహజ సిద్ధమైన సుగంధ నూనెలు ఉంటాయి. ఈ ఆకులను నీటిలో మరిగించి ఆవిరి పట్టడం లేదా ఆకుల టీ తాగడం వల్ల మెదడు ఉత్తేజితమై ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రాత్రి వేళల్లో మంచి నిద్ర పట్టడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు: ఈ ఆకుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
రక్తం శుద్ధి, బీపీ నియంత్రణ: దబ్బకాయ ఆకుల రసంలో రక్తంలోని విషపదార్థాలను తొలగించే గుణాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి.
ఇందుకోసం కొన్ని లేత దప్పళం ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటిని రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించి, కొద్దిగా తేనె లేదా సైంధవ లవణం కలిపి హెర్బల్ టీ లాగా తీసుకోవచ్చు.




