Reading Time: < 1 minute

గుడ్ న్యూస్: ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Caption of Image.

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో ఆగస్టు 15వ తేదీన సీఎం రేవంత్ కొత్త కార్డుల పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. 

15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ ఒకేసార ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 5 లక్షల  కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  

అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ జరగనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. పేద కుటుంబాల ఆహార భద్రతకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పాలనలో రేషన్ కార్డుల పంపిణీ మరో కీలక మైలురాయి అని అన్నారు. 

తెలంగాణలో రేషన్ కార్డులు ఆన్ లైన్ లో అలాట్ అయినప్పటికీ.. ఫిజికల్ గా చాలా మందికి ఇంకా కార్డులు రాలేదు. అయితే కొందరు ఆన్ లైన్ కార్డుల మీద రేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే మొత్తం కోటి ఐదు లక్షల మందికి ఫిజికల్ గా.. స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది. ఆగస్టు 15న అన్ని నియోజకర్గాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. 

©️ VIL Media Pvt Ltd.