
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సోమవారం రాత్రి భారతీయ వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా హెచ్చరికలు లేకుండా దేశవ్యాప్తంగా అనేకమంది యూజర్ల ఖాతాలను అకస్మాత్తుగా ‘రివ్యూ’ పరిధిలోకి పంపింది. దీంతో సదరు అకౌంట్ల నుంచి మెసేజ్లు పంపడం, కాల్స్ చేయడం వంటి అన్ని రకాల సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సమస్య సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైంది. యూజర్లు యాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై “అకౌంట్ ఇన్ రివ్యూ” అనే పాప్-అప్ మెసేజ్ దర్శనమిచ్చింది. సేవా నిబంధనల ఉల్లంఘనలపై మీ ఖాతా కార్యకలాపాలు, డివైజ్ సమాచారాన్ని పరిశీలిస్తున్నామని, ఈ తనిఖీ పూర్తయ్యేందుకు 24 గంటల సమయం పడుతుందని వాట్సాప్ ఆ సందేశంలో స్పష్టం చేసింది. దాంతో రోజువారీ పని, వ్యాపారాల కోసం వాట్సాప్‌పైనే ఆధారపడిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు ఎదురైన ఈ అనుభవాలపై యూజర్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారిక యాప్‌లనే ఉపయోగిస్తున్నప్పటికీ, ఎటువంటి తప్పు చేయకుండానే ఖాతాలను సస్పెండ్ చేయడం ఏంటని వాట్సాప్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ వరుస పోస్టులు పెట్టారు.ఈ నెటిజన్ల ఆందోళనపై స్పందించిన మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు. తమ ప్లాట్‌ఫామ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, యూజర్ల భద్రతను కాపాడేందుకు క్రమం తప్పకుండా ఇలాంటి ఆటోమేటెడ్ తనిఖీలు చేపడతామని తెలిపారు. ఈ భద్రతా ప్రక్రియలో కొన్నిసార్లు సాంకేతిక పొరపాట్లు జరిగి ఉండవచ్చని అంగీకరించారు. బాధితుల అకౌంట్లను త్వరగా సమీక్షించి, సమస్యను వీలైనంత వేగంగా పరిష్కరించి సేవలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!
టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య.. షాకింగ్ నిజం చెప్పిన డ్రైవర్
ఏపీలో మహిళలకు ఫ్రీగా లక్ష పట్టుచీరలు! ఊరూరూ తిరిగి పంచుతున్న బీజేపీ నేత