Reading Time: 2 minutes

Jiya Shankar: ప్రియుడితో బిగ్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్.. రొమాంటిక్ ఫొటోలతో ఫ్యాన్స్కు సర్‌ప్రైజ్..

Caption of Image.

బాలీవుడ్ సీరియల్ నటి, ‘బిగ్ బాస్ OTT 2’ఫేమ్ జియా శంకర్ తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించింది. చాలా కాలంగా తన ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్గా దాస్తూ వస్తున్న జియా, ఎట్టకేలకు ప్రియుడు కరణ్‌తో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 

రొమాంటిక్ ప్రపోజల్.. 

బ్యూటీ జియా శంకర్ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కరణ్ ధనక్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్నీ పలుమార్లు దాచిపెట్టి ఎట్టకేలకు తన ఎంగేజ్ మెంట్తో ఫ్యాన్స్ను సుర్ప్రైస్ చేసింది. ఈ నేపథ్యంలో జియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపోజల్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేసింది. పచ్చని ప్రకృతి, సముద్ర తీరం ఒడ్డున ఈ అందమైన జంట ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుని ఆకట్టుకున్నారు.

ALSO READ : Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు.. 

ఈ ప్రత్యేక వేడుకలో కరణ్ మోకాళ్లపై కూర్చొని జియాకు ప్రపోజ్ చేస్తూ, దగ్గరికి తీసుకున్నాడు. ఆ క్షణంలో జియా భావోద్వేగానికి గురై ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫొటోల్లో జియా ధరించిన పెద్ద డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపోజల్ వేడుకలో జియా లెమన్-ఎల్లో రంగు డ్రెస్‌లో ఆకట్టుకోగా, కరణ్ ధనక్ ఐవరీ షర్ట్, వైట్ ట్రౌజర్స్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ఇద్దరి దుస్తులు ఈ వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. 

ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న నటి.. 

నటి జియా ఓ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ, ‘‘మనం ఊహించని సమయంలోనే నిజమైన ప్రేమ దొరుకుతుంది. వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, అతనితో మాట్లాడిన ప్రతిసారీ ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేది’’ అని పేర్కొన్నారు. 

కరణ్ తన బెస్ట్ ఫ్రెండ్, తన ప్రపంచమని, ఆయనతో జీవితాంతం కలిసి ఉండాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రేమ పుకార్లకు తెర..
 
గతంలో జియా శంకర్ లవ్ స్టోరీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, ‘బిగ్ బాస్ OTT 2’  సహ-పోటీదారు అభిషేక్ మల్హాన్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రచారాన్ని జియా పలుమార్లు ఖండిస్తూ తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అనంతరం ఓ మిస్టరీ వ్యక్తితో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోను పంచుకోవడంతో మరోసారి ఆమె లవ్ స్టోరీ చర్చనీయాంశంగా మారింది. ఇక ఎట్టకేలకు ప్రియుడు కరణ్ ధనక్‌తో నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించి, తన రిలేషన్‌షిప్‌పై వస్తున్న అన్ని రూమర్లకు జియా చెక్ పెట్టింది. 

©️ VIL Media Pvt Ltd.