Reading Time: < 1 minute
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే మైదానంలోకి.. చివరి నిమిషంలో ఊహించని మార్పు.. అసలేం జరిగిందంటే..?

Rohit Sharma Retirement: ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ముగిసేసరికి రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. లార్డ్స్ వేదికగా సాధించిన అద్భుత శతకం ఒకవైపు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంటే, మరోవైపు బిసిసిఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సరికొత్త వివాదానికి తెరలేపింది.

రిటైర్మెంట్ ఆలోచన నుంచి లార్డ్స్ విధ్వంసం వరకు

ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు సాగాయి. ప్రారంభ రెండు వన్డేల్లో ఘోరంగా విఫలం కావడంతో ఇక ఆయన స్థానానికి ముగింపు కార్డు పడినట్లేనని అందరూ భావించారు. ప్రతికూల పరిస్థితుల నడుమ మానసికంగా రిటైర్మెంట్‌కు సిద్ధపడిన రోహిత్, మూడో వన్డేలో విశ్వరూపం చూపించారు. లార్డ్స్ మైదానంలో 138 పరుగుల మరపురాని సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ ఒక్క ఇన్నింగ్స్ మొత్తం సమీకరణాలను తలకిందులు చేసింది.

ఎక్కువమంది చదివింది: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

బిసిసిఐ వర్సెస్ సెలెక్షన్ కమిటీ.. తెరపైకి తీవ్ర విభేదాలు

రోహిత్ విధ్వంసకర శతకం తర్వాత బిసిసిఐ పెద్దలు ఆయనకు మరింత కాలం అవకాశమివ్వాలని పట్టుబడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా యంగ్ టీమ్‌ను సిద్ధం చేయాలని భావిస్తున్న సెలెక్షన్ కమిటీకి ఇది అస్సలు రుచించడం లేదు. బోర్డు కార్యదర్శి దేవజీత్ సైకియా స్పందిస్తూ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయన జట్టు ప్రణాళికల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. బోర్డు ప్రకటనతో సెలెక్టర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎక్కువమంది చదివింది: IND vs PAK: పాకిస్తాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. స్వ్కాడ్ నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్..!

అగార్కర్ కుర్చీకి ప్రమాదం.. లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

సెలెక్టర్ల అభిప్రాయాన్ని పక్కన పెట్టి బిసిసిఐ రోహిత్‌కు మద్దతుగా నిలవడంతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి ప్రమాదంలో పడింది. బోర్డు నిర్ణయాన్ని ఎదురించి ముందుకు వెళ్లలేకపోతున్న సెలెక్షన్ కమిటీ పనితీరుపై బిసిసిఐ ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే అగార్కర్‌ను తప్పించి, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) అధిపతి వివిఎస్ లక్ష్మణ్‌ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..