Reading Time: 2 minutes

Priya Prakash Varrier: కాషాయ డ్రెస్లో హీరోయిన్ ప్రియా వారియర్.. రిపోర్టర్ విచిత్ర ప్రశ్నపై నెటిజన్లు ఫైర్!

Caption of Image.

సోషల్ మీడియా సెన్సేషన్, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమెను ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ప్రశ్నపై నెటిజన్లు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ప్రియా ప్రకాష్ వారియర్‌ను ఏమని ప్రశ్నించారు? ఆ వీడియో ఎందుకు వైరల్ అయింది? యూట్యూబర్ తీరుపై నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఏం జరిగింది?

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ‘వింక్ గర్ల్’గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే ప్రముఖ పర్సనల్ కేర్ బ్రాండ్ ‘కుట్టికూర’ (KuttyKura) ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా ప్రకాష్ వారియర్, ఆరెంజ్ (కాషాయం) రంగు దుస్తుల్లో కనిపించారు.

ఈ సందర్భంగా ఓ యూట్యూబర్ ఆమెను, “బ్రాండ్ బాటిల్ కలర్‌ను చూసి ఈ డ్రెస్ వేసుకున్నారా? లేక కేరళలో ఆరెంజ్ అలర్ట్ ఉందని ఇలా వచ్చారా?” అంటూ ప్రశ్నించాడు. ప్రియా అసౌకర్యంగా ఫీల్ అవుతూ “బ్రాండ్ థీమ్‌కు సరిపోయేలా ఈ డ్రెస్‌ను ఎంపిక చేసుకున్నాను” అంటూ సింపుల్‌గా బదులు ఇచ్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు రిపోర్టర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

నెట్టింట విమర్శలు..

యూట్యూబర్ అడిగిన ప్రశ్నపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఎవరు ఏ రంగు దుస్తులు ధరించాలనేది వారి వ్యక్తిగత ఇష్టం”, “ఇలాంటి ప్రశ్నలు అడగడం సరైంది కాదు”, “వ్యూస్ కోసం అనవసర వివాదాలు సృష్టించొద్దు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్లు అనవసరంగా వివాదాస్పద ప్రశ్నలతో ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం రిపోర్టర్ సాధారణంగానే ప్రశ్నించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ALSO READ : రాజమౌళి కఠిన భద్రతకు మరోసారి గండి.. ‘వారణాసి’ నుంచి మహేష్ యాక్షన్ సీన్ లీక్!

ప్రియా వారియర్ ప్రాజెక్ట్స్..

‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సంచలనంగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ , టాలీవుడ్‌లో ‘చెక్’, ‘ఇష్క్’, ‘బ్రో’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో ‘త్రి మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ఆమె ‘కజిన్స్ అండ్ కల్యాణ్స్’ వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.

©️ VIL Media Pvt Ltd.