Reading Time: < 1 minute

రేపు(ఆగస్టు 06) బంజారాహిల్స్‌‌ ‘కేర్’లో ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా బంజారాహిల్స్‌‌ కేర్ హాస్పిటల్స్ ఔట్‌‌ పేషెంట్ సెంటర్‌‌లో గురువారం ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్లు వాస్క్యులర్ సర్జన్ పీసీ గుప్తా తెలిపారు. నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, తిమ్మిరి, కాళ్ల వాపు, మానని పాద గాయాలను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. 

షుగర్​ఉన్నవారు, పొగ తాగేవారు, 50 ఏళ్లు పైబడినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  పరిమిత సంఖ్యలోనే నమోదు ఉంటుందని, ముందస్తు అపాయింట్‌‌మెంట్ కోసం 040-61 565656  నంబర్‌‌ను సంప్రదించాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.