Reading Time: < 1 minute

వానాకాలం.. వీకెండ్‏లో ట్రెక్కింగ్‎కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Caption of Image.

వర్షం పడుతున్న టైంలో పాల నురగల్లాంటి జలపాతాల్ని చూడాలనుకుంటారు చాలామంది. అందుకోసం వాగులు వంకలు దాటుతూ, గుట్టలు, కొండలు ఉన్న దారుల్లో ట్రెక్కింగ్ చేస్తారు. అయితే ఈ సీజన్లో కొండ ప్రాంతాల్లోని మట్టి రోడ్లన్నీ బురదతో నిండి ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ట్రెక్కింగ్కి వెళ్లేవాళ్లు ఏమేం వెంట తీసుకెళ్లాలి..? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేది చెప్తున్నారు నిపుణులు..

రాళ్లు రప్పలు, బురదలో నడుస్తున్నప్పుడు జారిపడకుండా ఉండేందుకు గ్రిప్ ఉన్న ట్రెక్కింగ్ షూ వేసుకోవాలి. నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోసం చిన్న కర్రలు, హైకింగ్ పోల్స్ వాడాలి. రాక్ క్లైంబింగ్, రోప్ క్లైంబింగ్, ర్యాపెల్లింగ్ వంటి అడ్వెంచరస్ యాక్టివిటీలు చేసేవాళ్లు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్ ఉండాలి.

ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు శరీరాన్ని స్ట్రెచ్ చేస్తుండాలి. దాంతో కీళ్ల దగ్గరి లిగమెంట్స్, టిండాన్స్ బాగా పనిచేస్తాయి. అంతేకాదు కండరాలు రిలాక్స్ అయి అలసటగా ఉండదు. ఎక్కువ దూరం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తే.. నీళ్లు బాగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్కు లోనవుతారు. ఒక్కోసారి కండరాలు పట్టేస్తాయి కూడా. అంతేకాదు అలసటగా అనిపిస్తే మధ్యలో కొంచెం సేపు ఆగాలి.

ALSO READ : కనుబొమల్లో తెల్లని డస్ట్.. అది సబ్బు కాదు చుండ్రు! ఇలా తగ్గించుకోండి

ట్రెక్కింగ్ చేసేందుకు ఎక్కువ ఎనర్జీ కావాలి. అందుకోసం ఎనర్జీ డ్రింక్స్, గ్లూకోజ్ వాటర్, చాక్లెట్స్ వంటివి తీసుకెళ్లాలి. బ్యాండేజ్, ఐస్ ప్యాక్స్ వంటివి ఉంటే దెబ్బతగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో.. నిపుణులు చెప్పిన సూచనలు పాటించడం ద్వారా సరదాగా కోసం వెళ్లిన ట్రెక్కింగ్‎ను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు..

©️ VIL Media Pvt Ltd.