Reading Time: < 1 minute

ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా? : సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

ప్రధాని మోదీని.. జెన్ జీ ఉద్యమ కుర్రోళ్లు తిడితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, ఆగస్ట్ 5వ తేదీ ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారాయన. పీఎం మోదీ తల్లిని విమర్శించిన దాని కంటే.. జెన్ జీ యువతను.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తున్న విద్యార్థులను బీజేపీ వాళ్లే చాలా ఎక్కువగా తిట్టారన్నారు సీఎం రేవంత్. 

డీఎస్పీ అధికారుల బదిలీ అనేది సీఎం విచక్షణాధికారం అని.. రాజ్యాంగం ప్రకారం దక్కిన హక్కు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ అధికారిని బదిలీ చేయటం ప్రభుత్వానికి ఉన్న అధికారం అని స్పష్టం చేశారాయన. ఢిల్లీలో కూర్చున్న వాళ్లు ఎలాగైనా విమర్శలు, ఆరోపణలు చేస్తారంటూ తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. 

బీజేపీ నేతలు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని.. కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను చాలా ఎక్కువగా దూషించారన్నారాయన. మోదీని, మోదీ తల్లిని దూషించిన దాని కంటే.. విద్యార్థులను బీజేపీ వాళ్లే ఎక్కువగా తిట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

©️ VIL Media Pvt Ltd.