
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో భారీ బడ్టెట్ సినిమాలను తెరకెక్కించడం కామన్ అయ్యింది. స్టార్ హీరోహీరోయిన్లతో కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తూ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే అందులో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అవుతున్నాయి. మిగతా చిత్రాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలై తీరా చూస్తే బోల్తాకొడుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంటే .. భారీ బడ్జెట్ మూవీస్ మాత్రం నిర్మాతలకు తీవ్ర నిరాశ మిగులుస్తున్నాయి. కనీసం సినిమాలో నటించిన స్టార్స్ రెమ్యునరేషన్స్ కూడా రాబట్టలేకపోతున్నాయి. దీంతో నిర్మాతకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు అలాంటి ఒక సినిమా గురించి మనం తెలుసుకుందాం. ఈ మూవీ భారతీయ సినీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్..
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
రూ.150 కోట్ల బడ్జెట్.. స్టార్ హీరోహీరోయిన్లు.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. అతిపెద్ద టెక్నీషియన్స్.. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా. కానీ బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోయింది. కనీసం హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా రాబట్టలేకపోయింది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు గణపత్: పార్ట్ 1. బాలీవుడ్ స్టా్ర్ టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. ముందు నుంచి మంచి హైప్ నెలకొన్న సినిమాకు ఊహించని రిజల్ట్ వచ్చింది. ఇందులో టైగర్ సరసన కృతి సనన్ కథానాయికగా నటించింది. అలాగే అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించగా.. ఫస్ట్ డే రూ.2.5 కోట్ల ఓపెనింగ్ మాత్రమే రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు టైగర్ ష్రాఫ్ రూ.40 కోట్లు పారితోషఇకం తీసుకున్నట్లు టాక్. కానీ ఈ మూవీ మాత్రం కనీసం హీరో స్థాయి రెమ్యునరేషన్ కూడా అందుకోలేకపోయింది. ఇప్పటికీ ఈ మూవీకి అంతగా రెస్పాన్స్ రాలేదు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..