Reading Time: 2 minutes
Pakistan Beat West Indies By 8 Wickets Climb To 8th In Wtc 2025 27 Points Table

Pak vs WI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27లో పాకిస్థాన్ జట్టు కీలక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. దీనితో పాక్ WTC పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత పట్టికలో చివరి స్థానానికి చేరుకున్న పాకిస్థాన్, ఈ విజయంతో తిరిగి 8వ స్థానానికి చేరుకుంది.

రెండో టెస్టు విజయంతో పాకిస్థాన్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయడంతో.. దీంతో ఆ జట్టు పాయింట్ల శాతం (PCT) 22.22కి చేరుకుంది. తొలి టెస్టు తర్వాత కేవలం ఒకే విజయంతో పట్టికలో అట్టడుగున ఉన్న పాకిస్థాన్‌కు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది.

ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒకే ఓటమితో ఆ జట్టు 87.50 PCT ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 75.00 PCTతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22 PCTతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆపై బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 58.33 PCT సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు తొమ్మిది టెస్టుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో 48.15 PCTతో భారత జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక (41.67 PCT), ఇంగ్లండ్ (24.36 PCT) వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నాయి.

Pak Vs Wi (1)

ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ అద్భుత విజయం సాదిందించింది. ఈ విజయంతో విదేశీ గడ్డపై వరుసగా 8 టెస్టుల్లో ఎదురైన ఓటముల పరంపరకు స్వస్తి పలికింది. అంతేకాకుండా వెస్టిండీస్‌పై 2000 సంవత్సరం తర్వాత ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోని రికార్డును కొనసాగించింది.

ఈ మ్యాచ్ లో 77 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన అబ్దుల్లా షఫీక్ అజేయంగా 24 పరుగులు చేయగా, కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి సిరీస్ ఆడుతున్న బాబర్ అజామ్ కూడా 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌ను ముగించే క్రమంలో బాబర్, వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. దీనితో సిరీస్‌ 1-1తో సమం అయ్యింది.