Reading Time: < 1 minute
Himachal Pradesh High Court Mother In Law Right To Live In Daughter In Law House

కోడలి ఇంట్లో అత్తగారు కూడా నివసించే హక్కు ఉంటుందని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన సొంత సంపాదనతో కట్టుకున్న ఇంటిలోంచి వెళ్లిపోవాలని అత్తమామలకు కోడలి ఆదేశించడంతో బాధిత అత్తగారు గృహ హింస కింద కేసు పెట్టింది. విచారణ సందర్భంగా ఇల్లు కోడలి పేరు మీద ఉన్నప్పటికీ.. అక్కడ నివసించే హక్కు అత్తగారికి కూడా పూర్తిగా ఉంటుందని న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

మండి జిల్లాల్లోని రామ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో 2013, మే నెలలో వివాహం జరిగింది. 2014 వరకు అత్తమామలతోనే కోడలి నివసించింది. అయితే ఇంతలో వివాదాలు తలెత్తడంతో అత్తమామలను ఇంట్లో నుంచి గెంటేసింది. 2025, నవంబర్ 7న ఇంట్లో నుంచి పంపేసి అద్దెకు ఇచ్చేసింది. దీంతో అత్తగారు గృహ హింస కేసు పెట్టింది. అయితే తన సొంత సంపాదనతో నిర్మించుకున్న ఇల్లు అని దిగువ కోర్టులో కోడలు పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి రాకేష్ కాంతాలా విచారించి కొట్టేశారు. ఉమ్మడి ఇంట్లో అత్తగారికి హక్కు ఉంటుందని తెలిపింది.

అయితే కోడలిపై అత్తగారు పెట్టిన గృహ హింస కేసు తాజాగా హైకోర్టులో విచారణ రాగా.. కోడలి ఇంట్లో అత్తగారికి నివసించే హక్కు ఉంటుందని.. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ఇరుపక్షాలు కలిసి నివసించినప్పుడు అందరికీ హక్కులు ఉంటాయని తెలిపింది. అత్తమామలు బయటకు పంపేసి అద్దెకు ఇవ్వడం ఏ మాత్రం సరైందని కాదని పేర్కొంది. గృహ సంబంధంలో నివసిస్తున్న ప్రతి మహిళకు, ఆమె కుమార్తె, సోదరి, భార్య, కోడలు, అత్త అయినా సరే.. ఉమ్మడి గృహంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఇల్లు కోడలి పేరు మీద ఉన్నప్పటికీ.. అక్కడ నివసించే హక్కు అత్తగారికి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది.