Reading Time: < 1 minute

UPI పేమెంట్స్పై ఛార్జీలు వేసుకోండి: బ్యాంకులకే అధికారం.. లోక్ సభలో బిల్లుకు ఆమోదం

Caption of Image.

ఢిల్లీ: UPI లావాదేవీలపై ఛార్జీల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో.. బ్యాంకులకు అధికారం ఇచ్చేందుకు అనుమతిస్తూ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎలాంటి చర్చ లేకుండానే UPI ట్రాన్సాక్షన్ ఛార్జీల బిల్లుకు లోక్ సభలో ఆమోదం జరగడం గమనార్హం.

రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే.. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడం ఖాయంగా కనిపిస్తోంది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 బిల్లు సవరణకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే.. యూపీఐ పేమెంట్స్పై ఛార్జీలు వసూలు చేసే అధికారం పూర్తిగా బ్యాంకులదే అవుతుంది.

రూ.రెండు వేలు పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.5 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)విధిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ చార్జీని ఎవరు భరిస్తారనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఎండీఆర్ భారం వ్యాపారులకు అదనపు నిర్వహణ ఖర్చు అవుతుంది. లాభాలను, వినియోగదారులకు ఇచ్చే డిస్కౌంట్లను తగ్గిస్తుంది.

ముఖ్యంగా చిన్న కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారస్తులపై ఎండీఆర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రూ.10 వంటి తక్కువ విలువ గల యూపీఐ పేమెంట్లను వ్యాపారులు తిరస్కరించే ప్రమాదం ఉంది. దీనివల్ల డిజిటల్ చెల్లింపుల వేగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.