
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం ఆలయాన్ని సందర్శించింది. అక్కడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ క్రమంలో ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే శ్రీలీల మాత్రం ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల అరుణాచలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీలీల. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
అయితే ఇక్కడే శ్రీలీలకు దురదృష్టం స్టార్ట్ అయ్యింది. ధమాకా తర్వాత శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్, గుంటూరు కారం, రాబిన్ హుడ్, మాస్ జాతర, ఇక రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఒక్క భగవంత్ కేసరి సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది. దీనికి తోడు ఇటీవల శ్రీలీల మధ్యలో తప్పుకున్న సినిమా లెనిన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే అజిత్ సినిమా నుంచి కూడా ఆమె తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే ధనుష్ నటిస్తోన్న ఓమ్ సినిమాలో కథానాయికగా చేస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీలీల..
Divine beauty
#sreeleela pic.twitter.com/PXcMudo3fg
— sreeleela fan (@glamverse_x) August 5, 2026
Sreeleela in Tiruvannamalai temple @sreeleela14 #sreeleela pic.twitter.com/tyoc5Yfjgw
— Sreeleela Fan Page (@Sreeleelas14) August 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

