Reading Time: < 1 minute

మన భారతీయుల భోజనంలో పెరుగు లేనిదే తిండి పూర్తికాదు. అయితే రాత్రివేళ పెరుగు తినడం మంచిదా లేక జీర్ణ సమస్యలకు దారితీస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సాధారణంగా చాలామంది రాత్రి భోజనం చివర్లో లేదా నిద్రపోయే ముందు పెరుగు తింటుంటారు. కానీ, రాత్రిపూట పెరుగు తినే సమయం ఎంతో ముఖ్యం! అసలు రాత్రివేళ పెరుగు ఎప్పుడు తినాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..

రాత్రిపూట పెరుగు తినే బెస్ట్ టైమ్: రాత్రి పడుకోవడానికి సరిగ్గా ముందు కాకుండా కనీసం 1 నుండి 2 గంటల ముందే కొద్దిగా పెరుగు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా తినడం వల్ల మనం నిద్రపోయే సరికి జీర్ణక్రియ సగం పూర్తవుతుంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం అజీర్తి లేదా అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ఉంటుంది.

Best Time to Eat Curd: Is It Safe Before Sleeping?
Best Time to Eat Curd: Is It Safe Before Sleeping?

మంచి నిద్రకు, జీర్ణక్రియకు సహాయం: పెరుగులో ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను పుట్టించే హార్మోన్లను ప్రేరేపించి రాత్రివేళ హాయిగా, ప్రశాంతమైన నిద్ర పట్టేలా తోడ్పడుతుంది.ఇక  అలాగే రాత్రిపూట పెరుగు తినేటప్పుడు అందులో ఒక చిటికెడు జీలకర్ర పొడి లేదా నల్ల ఉప్పు కలుపుకుని తింటే జీర్ణక్రియ మరింత వేగంగా సులభంగా జరుగుతుంది.

ఇక రాత్రివేళ పెరుగు తినడం తప్పు కాదు, కానీ తినే సమయం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. పడుకోవడానికి గంటన్నర ముందే మితంగా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుండటమే కాకుండా రాత్రివేళ ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన మరియు ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా అందించబడింది. ఆస్తమా జలుబు సైనస్ లేదా తీవ్రమైన జలుబు చేసే తత్వం ఉన్నవారు రాత్రిపూట పెరుగు తీసుకునే ముందు వైద్యాధికారుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

The post పడుకునే ముందు పెరుగు తినొచ్చా? నిపుణులు సూచించే బెస్ట్ టైమ్ ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.