Reading Time: < 1 minute

హైదరాబాద్లో దాదాపు 10 లక్షల ఓట్లు ఓటర్ల లిస్ట్ నుంచి ఔట్ !

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఓట్లు ఓటర్ల లిస్ట్ నుంచి కనుమరుగు కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో నిర్వహించిన SIR ప్రక్రియలో ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగి ఇక్కడ కూడా నమోదైన డూప్లికేట్ ఓటర్లు, ఆచూకీ లేనివారు (అబ్సెంట్ ), చనిపోయిన.. ఇలా ఈ మూడు కారణాల వల్ల దాదాపు 9.95 లక్షల ఓటర్లను హైదరాబాద్ జిల్లా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది.

ఇలాంటి ఓటర్లను హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. సికింద్రాబాద్ 79 వేల 457 ఓటర్లు, జూబ్లీ హిల్స్ 88 వేల 933 ఓటర్లు, ముషీరాబాద్ 84 వేల 917 ఓటర్లు, యాకుత్‌పురా 84 వేల 792 ఓటర్లు, చాంద్రాయణగుట్ట 81 వేల 500 ఓటర్లు లెక్క తేలారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9.95 లక్షల ఓటర్లను ఆబ్సెంట్, షిఫ్టెడ్ Or డెడ్ ఓటర్లుగా గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్.వి. కర్ణన్ చెప్పారు.

బుధవారం ఈ గణాంకాలను విడుదల చేశారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 88 వేల 933 మంది ఏఎస్డీ ఓటర్లు అత్యధికంగా నమోదు కాగా, అంబర్‌పేట్‌లో అత్యల్పంగా 38 వేల 208 మంది ఓటర్లు నమోదయ్యారు. ఆగస్టు 5 నాటి జనాభా గణన పత్రాల డిజిటలైజేషన్ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ జిల్లాలో 57.56 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది. మొత్తం 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లలో.. 27 లక్షల 26 వేల 665 మంది ఓటర్లకు డిజిటలైజేషన్ పూర్తయింది.

రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్న వాళ్లు ఒక్క చోటుకే పరిమితం కావడం, ఉపాధి, వివాహాలు, ఇతర కారణాల వల్ల శాశ్వతంగా నివాసాలు మారడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, సరైన పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈ ఓటర్లను అన్ కలెక్టబుల్ ఎన్యమురేషన్ దరఖాస్తుల కింద నమోదు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.